సింపుల్‌గా, కంఫర్టబుల్‌గా రకుల్ ప్రీత్ ప్రేమ వివాహం 1 y ago
టాలీవుడ్ లో 'కెరటం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. కన్నడలో 2007లో గిల్లీ సినిమాతోనే తన కెరీర్ ప్రారంభించింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దెగ్గరయ్యింది. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లాడింది. గత ఏడాది ఫిబ్రవరి 21న సింపుల్గా, హడావుడి లేకుండా పెళ్ళి చేసుకున్నారు. అయితే ఫోటోలు లీక్ చేయడం ఇష్టం లేక నో ఫోన్ పాలసీతో ఈ జంట ప్రేమ వివాహం జరిగింది. ఈ రోజు తన పెళ్లి రోజు కావడంతో అభిమానులు ఇప్పటికైనా ఆ ఫోటోలు రిలీజ్ చేస్తే బాగుండునని కోరుతున్నారు. ప్రస్తుతం రకుల్ "మెరీ హస్బెండ్ కీ బీవీ" సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ అవనుంది.